ఎండ్ గేమ్ యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే అవెంజర్స్ – ఎండ్ గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఈ మూవీ కలెక్షన్స్ కనీవిని ఎరుగని [more]
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే అవెంజర్స్ – ఎండ్ గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఈ మూవీ కలెక్షన్స్ కనీవిని ఎరుగని [more]
ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే అవెంజర్స్ – ఎండ్ గేమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి. ఈ మూవీ కలెక్షన్స్ కనీవిని ఎరుగని రీతిలో వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రికార్డుల్ని ఈ మూవీ బ్రేక్ చేస్తుంది. ఇండియాలో అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దాదాపు 8381 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 10400 కోట్లు(1.5 బిలియన్ డాలర్ల) వసూలు చేసి రికార్డు నమోదు చేసిందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఇటువంటి రికార్డు బ్రేకింగ్ మూవీలో నటించిన మార్వల్ హీరోస్ ఎంత పారితోషికం అందుకున్నారో తెలియాలంటే ఇది చదవండి.
రాబర్ట్ అదిరిపోయే పారితోషకం
ఈ మూవీ కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని మొదటి స్థానంలో ఉన్న హీరోగా రాబర్ట్ డౌనీ జూనియర్ పేరు మార్మోగుతోంది. క్రిటిక్స్ సైతం సినిమాలో ఇతని నటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఐరన్ మ్యాన్ గా అత్యంత ప్రభావవంతమైన సూపర్ హీరోగా రాబర్ట్ నటించారని ప్రశంసించారు. గతంలో వచ్చిన ఇన్ ఫినిటీ వార్ కోసం రాబర్ట్ 521 కోట్లు(75 మిలియన్ డాలర్లు) అందుకున్నాడు. ఇప్పుడు ఎండ్ గేమ్ కోసం అంతకుమించి తీసుకున్నాడట.
ఇన్ ఫినిటీ వార్ కంటే ఎక్కువ
ఈయన తరువాత అతడికి దరిదాపుల్లో పారితోషకాలు లేకపోయిన కళ్లు చెదిరే పారితోషకాలు ఎవరెవరికి దక్కాయి అంటే.. స్కార్లెట్ జాన్సన్, క్రిస్ హేమ్స్ వర్త్, క్రిస్ ఇవాన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో స్కార్లెట్ జాన్సన్ ఇన్ఫినిటీ వార్ కోసం 139 కోట్లు(20 మిలియన్ డాలర్లు), క్రిస్ ఇవాన్స్ (కెప్టెన్ అమెరికా), క్రిష్ హేమ్స్ వర్త్ (థోర్) ఇన్ ఫినిటీ వార్ కోసం 139 కోట్లు(20 మిలియన్ డాలర్లు) అందుకున్నారు. ఎండ్ గేమ్ కి ఈ ముగ్గురూ అదే పారితోషికం అందుకున్నారని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.