Mon Dec 23 2024 10:57:39 GMT+0000 (Coordinated Universal Time)
హృతిక్తో వార్ 2.. దర్శకుడికి ఎన్టీఆర్ రూల్స్..
ఆ విషయంలో వార్ 2 దర్శకుడికి ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేశాడట. ప్రస్తుతం తను నటిస్తున్న దేవర..
మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ (NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న సినిమా వార్ 2 (War 2). హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇండియాలోనే ఒక భారీ మల్టీస్టారర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇక ఈ మూవీ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అని అందరిలో ఒక క్యూరియాసిటీ నెలకుంది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ పనులు అన్ని పక్క ప్రణాళికతో సిద్ధం చేస్తున్నాడు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఈ దర్శకుడు ఎన్టీఆర్ ని కలుసుకున్నాడు. హైదరాబాద్ వచ్చి తారక్ ని కలుసుకొని మూవీ వర్క్స్ గురించి తెలియజేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా అయాన్ కి ఒక రూల్ పాస్ చేశాడట. ప్రస్తుతం తను నటిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్ పూర్తి అయిన తరువాతే వార్ 2 సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తాను, అప్పటి వరకు నో ఎంట్రీ అంటూ తన రూల్ చెప్పాడట.
ఇందుకు అయాన్ కూడా ఒకే చెప్పాడట. వార్ 2 ని వచ్చే ఏడాది మధ్యలో పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ సమయానికి ఎన్టీఆర్ దేవర షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోతుంది. ఇక ఈ మూవీని 2025 జనవరిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అంటూ చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి బాలీవుడ్ కి ఎన్టీఆర్ ఎలా ఎంట్రీ ఇస్తున్నాడో చూడాలి. కాగా ఈ మూవీ 2019లో వచ్చిన 'వార్' కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఆ మూవీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా కనిపించారు. ఆ చిత్రాన్ని పఠాన్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు. హృతిక్ 'వార్', షారుఖ్ 'పఠాన్', సల్మాన్ ఖాన్ 'టైగర్' సిరీస్ సినిమాలో యశ్ రాజ్ ఫిలిమ్స్ సైఫ్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్నాయి.
Next Story