Mon Dec 23 2024 17:24:47 GMT+0000 (Coordinated Universal Time)
Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ ఇబ్బంది పెట్టడంతో బాబు మోహన్తో ఆ సాంగ్..
రాజేంద్రప్రసాద్ ఇబ్బంది పెట్టడంతో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.. బాబు మోహన్తో ఆ సూపర్ హిట్ సాంగ్ చేశారు.
Rajendra Prasad: టాలీవడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి.. రాజేంద్రప్రసాద్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్ సినిమాల్లో ప్రతిఒక్కరికి ఇష్టమైన చిత్రం 'రాజేంద్రుడు గజేంద్రుడు'. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కృష్ణారెడ్డి.. తన రెండో సినిమాని కూడా రాజేంద్రప్రసాద్ తోనే ప్లాన్ చేశారు. 'మాయలోడు' అంటూ వెండితెర పై మ్యాజిక్ చేసి రెండోసారి కూడా సూపర్ హిట్ ని అందుకున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో రాజేంద్రప్రసాద్, ఎస్వీ కృష్ణారెడ్డి మధ్య విబేధం వచ్చింది. మూవీ షూటింగ్ టైంలో రాజేంద్రప్రసాద్, కృష్ణారెడ్డిని చాలా ఇబ్బందులు పెట్టారట. ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను దర్శకుడు అవ్వడానికి రాజేంద్రప్రసాద్ కారణం. అయితే మాయలోడు సినిమా సమయంలో మాత్రం, ఆయన నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. షూటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్ సమయంలో కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా ‘చినుకు చినుకు అందెలతో’ సాంగ్ షూటింగ్ సమయంలో మరి ఇబ్బంది పెట్టారు" అంటూ చెప్పుకొచ్చారు.
ఆ పాటని సౌందర్య, రాజేంద్రప్రసాద్ మధ్య చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. దీంతో కృషారెడ్డి, సౌదర్యం దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాజేంద్రప్రసాద్ కి చెప్పి షూటింగ్ రమ్మని అడిగితే, ఆయన బదులిస్తూ.. "ఆమె ఇచ్చిన డేట్స్ కి నేను చెయ్యాలా" అని వ్యంగ్యంగా మాట్లాడారట. దీంతో చినుకు చినుకు పాటని బాబు మోహన్, సౌందర్యతో ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ సమయానికి రాజేంద్రప్రసాద్ చేస్తానని కబురు వచ్చింది.
కానీ ఎస్వీ కృష్ణారెడ్డి ఆ పాటని బాబు మోహన్ తో చేస్తానని, ఆయనికి మాట ఇవ్వడంతో.. మాట తప్పలేక ఆ సాంగ్ బాబు మోహన్ అండ్ సౌందర్యతోనే చేశారు. ఇక ఆ పాట ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తరువాత ఎస్వీ కృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్ మధ్య మళ్ళీ మరో సినిమా రాలేదు.
Next Story