Mon Dec 23 2024 05:53:27 GMT+0000 (Coordinated Universal Time)
రూ.54 కోట్ల వసూళ్లు చేసిన "బేబీ".. ఇంకా హౌస్ ఫుల్
షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ.. ఇండస్ట్రీలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన వైష్ణవి చైతన్య.. "బేబీ"లో మెయిన్ లీడ్ లో..
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తున్నాయి. మొన్న బలగం, నిన్న విరూపాక్ష, సామజవరగమన, నేడు బేబీ.. ఇలా చిన్న చిన్న సినిమాలే నిర్మాతలను లాభాల బాటపట్టిస్తున్నాయి. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన "బేబీ" కోట్ల రూపాయల వసూళ్లతో సరికొత్త సంచలనం సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. సాధారణంగా సినిమాల్లో హీరో తెలుగు వాడే అయినా.. హీరోయిన్ మాత్రం మరో భాషకు చెందినవారుంటారు. కానీ.. "బేబీ" అలా కాదు. తెలుగు హీరోనే కాదు.. హీరోయిన్ కూడా తెలుగమ్మాయి.. పక్కా తెలంగాణ అమ్మాయి కావడం విశేషం.
షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ.. ఇండస్ట్రీలో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన వైష్ణవి చైతన్య.. "బేబీ"లో మెయిన్ లీడ్ లో అదరగొట్టేసిందని ఇప్పటికే సక్సెస్ మీట్ లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. వసూళ్ల విషయానికొస్తే.. కేవలం 8 రోజుల్లోనే రూ.54 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్ తో.. తెరకెక్కిన "బేబీ" రూ.16 కోట్లు థియేట్రికల్, డిజిటల్, ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నేటి యువత ఆలోచన, ప్రేమ పేరుతో జరిగే కథలనే తెరపై సినిమాగా ఆవిష్కరించి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. రెండోవారంలో కొన్ని సినిమాలు విడుదలైనా అవి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. "బేబీ"కి కలిసొచ్చిందనే చెప్పాలి. రెండోవారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.70 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టొచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Next Story