Wed Jan 15 2025 01:08:30 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న "బాహుబలి" సింగర్.. కాబోయే భర్తని పరిచయం చేస్తూ పోస్ట్
తాజాగా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద జీవిత కాలానికి సంబంధించిన..
బాహుబలి సినిమాలో "మమతల తల్లి" పాటతో గాయనిగా గుర్తింపు పొందిన సింగర్ సత్య యామిని త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతోంది. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే పాడుతా తీయగా, స్వరాభిషేకం ప్రోగ్రామ్ ల ద్వారా యామిని సింగర్ గా శ్రోతలకు దగ్గరైంది. బాహుబలి తర్వాత గాయనిగా చాలా అవకాశాలు వచ్చాయి. శైలజారెడ్డి అల్లుడు, కొండపొలం, రాధేశ్యామ్, అఖండ, బింబిసార, అహింస వంటి సినిమాల్లో పాటలు పాడింది యామిని.
తాజాగా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద జీవిత కాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉందని రాసుకొచ్చింది. కానీ.. తనకు కాబోయే భర్తకు సంబంధించిన పేరు, వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. సింగర్ దామిని కామెంట్ తో అతనిపేరు తేజ అని తెలిసింది. ఈ పోస్టుపై సింగర్స్ గీతామాధురి, అనుదీప్, మనీషా, పూజా, దామిని, మోహన భోగరాజు, హేమచంద్ర, శ్రావణ భార్గవిలతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. న్యూ కపుల్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు.
Next Story