Mon Dec 23 2024 08:06:35 GMT+0000 (Coordinated Universal Time)
బలగం సినిమాకు మరో మూడు ఇంటర్నేషనల్ అవార్డులు
తాజాగా మూడు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్ బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బలగం మూవీ
టాలీవుడ్ లో ఇటీవల విడుదలైన బలగం సినిమా.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను జబర్దస్త్ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహించగా.. థియేటర్లు, ఓటీటీలోనూ ఆడియన్స్ ను అలరించింది. ఈ సినిమాకు జనం ఏ విధంగా పట్టంకట్టారో చూస్తూనే ఉన్నాం. ప్రతి ఊరిలోనూ స్క్రీన్లు ఏర్పాటు చేసి మరీ సినిమాను చూస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన బలగం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది.
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న బలగం.. మరిన్ని అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా మూడు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్ బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బలగం మూవీ ఏకంగా మూడు అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో బలగం మూవీకి అవార్డులు దక్కాయి. అంతర్జాతీయ వేదికపై బలగం వరుస అవార్డులను అందుకుంటోంది. ఈ సినిమా మున్ముందు మరిన్ని అవార్డులను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటించింది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించగా హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Next Story