Sun Dec 22 2024 22:07:46 GMT+0000 (Coordinated Universal Time)
బలగం సినిమాకి రెండు అంతర్జాతీయ అవార్డులు
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని..
కమెడియన్ వేడు దర్శకుడిగా రూపొందించిన తొలి చిత్రం బలగం. దిల్ రాజు కొడుకు, కూతురు కలిసి నిర్మించిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి.. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓటీటీలో సినిమా రిలీజైనా.. ఇంకా థియేటర్లో కలెక్షన్లు రాబడుతోంది. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనం, మానవ బంధాలను వెండితెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు. దానికే ప్రేక్షకులు ఫిదా అయి.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సగటు మధ్యతరగతి ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పించింది.
తాజాగా బలగం సినిమాకు రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బలగం సత్తా చాటింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఈ విషయాన్ని చిత్రదర్శకుడు వేణు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ‘నా బలగం సినిమాకు ఇది మూడో అవార్డు. ప్రపంచ వేదికపై బలగం మెరిస్తుంది. ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫి అవార్డును గెలుచుకున్నందుకు మా సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణుకు అభినందనలు’ అని ట్విట్టర్లో ఫోటోలు పంచుకున్నాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రూ.2 కోట్లతో నిర్మించగా.. ఇప్పటి వరకూ రూ.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
Next Story