Mon Dec 23 2024 03:45:54 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలీల విషయంలో మోక్షజ్ఞ నన్ను తిట్టాడు.. బాలయ్య
బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ, శ్రీలీల విషయంలో బాలయ్యనే తిట్టాడంట. ఇంతకీ మోక్షజ్ఞ ఎందుకు తిట్టాడు..?
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు 'భగవంత్ కేసరి' సినిమాని సిద్ధం చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్, కూతురిగా శ్రీలీల నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరోహీరోయిన్లతో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యింది.
ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. తన వారసుడు మోక్షజ్ఞ, శ్రీలీల విషయంలో తననే తిట్టాడని తెలియజేశాడు. ఇంతకీ మోక్షజ్ఞ ఎందుకు తిట్టాడు..? బాలయ్య ఏం చెప్పాడంటే.. ఈ సినిమాలో శ్రీలీల తన కూతురిగా నటించింది. తన తరువాత మూవీలో హీరోహీరోయిన్లుగా చేద్దామని బాలయ్య.. శ్రీలీలతో సరదాగా చెప్పాడట. ఇక ఇదే విషయాన్ని ఇంటిలో మోక్షజ్ఞ ముందు మాట్లాడాడంట. అది విన్న మోక్షజ్ఞ.. "ఏంటి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ" అని తిట్టాడని చెప్పుకొచ్చాడు.
మోక్షజ్ఞ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయం గురించే మోక్షజ్ఞ మాట్లాడుతూ.. "కుర్రహీరోని నేను రాబోతున్నాను. ఇప్పుడేమో నువ్వు ఆ అమ్మాయికి ఆఫర్ ఇస్తావు ఏంటి" అంటూ తిట్టాడని నిన్న స్టేజి పై అభిమానుల ముందు చెప్పుకొచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే ఈవెంట్ లో.. సినిమాలకు ప్రభుత్వాల సహకారం గురించి కూడా హాట్ కామెంట్స్ చేశాడు బాలయ్య.
అఖండ సినిమా సమయంలో ప్రభుత్వాలు తమకి సహకరించలేదని, ఎక్స్ ట్రా షోలు, రేట్లు పెంపు పట్ల ప్రభుత్వం సహకరించాలని, సినిమాలు నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పేర్కొన్నాడు. మరి ఈ భగవంత్ కేసరికి ప్రభుత్వాలు.. బాలయ్య విన్నపాలను అంగీకరిస్తుందా..? అనేది చూడాలి. కాగా ఈ మూవీ దసరా కానుగా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాల సక్సెస్ ని కంటిన్యూ చేసి బాలయ్య హ్యాట్రిక్ అందుకుంటాడా అనేది కూడా చూడాలి.
Next Story