Fri Jan 10 2025 19:11:48 GMT+0000 (Coordinated Universal Time)
కమర్షియల్ లో కనిపించేసిన నందమూరి బాలకృష్ణ.. వావ్..!
నందమూరి బాలకృష్ణ.. నాలుగు దశాబ్దాల కెరీర్ లో ఏనాడు కూడా ఆయన ఒక కమర్షియల్ లో కనిపించలేదు. కానీ తొలిసారి ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారంటే ప్రోమోలు ఏ రేంజిలో ఉండాలో మీ ఊహకే వదిలేస్తున్నాం. తాజాగా ఎంతో రాయల్టీగా బాలయ్య కనిపించిన యాడ్స్ వైరల్ అవుతూ ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీ సాయిప్రియ గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు బాలకృష్ణ. ఈ టాలెంటెడ్ హీరో సినిమాటిక్ స్టైల్లో 116 పారామౌంట్ వెంచర్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది.
బాలకృష్ణ తన మొట్టమొదటి యాడ్ ను సాయి ప్రియా గ్రూప్ బ్రాండ్ కోసం చేసి.. ప్రకటనల రంగంలోకి ప్రవేశించాడు. బాలకృష్ణపై భారీగా చిత్రీకరించిన ఈ కమర్షియల్ కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. ప్రకటనల ప్రపంచంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ కనిపించిన ఈ యాడ్ లో.. NBK1 నంబర్ ప్లేట్‌తో రోల్స్ రాయిస్ కారు ఉంది, ఇది బాలకృష్ణ మొదటి బ్రాండ్ ఎండార్స్మెంట్ అని సూచిస్తుంది. ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యునరేషన్‌ను బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ వీరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. వీరసింహా రెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. దీంతోపాటు అనిల్ రావిపూడి సినిమాను కూడా లైన్లో పెట్టాడు బాలయ్య. ఇక ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్నారు. రెండు ఎపిసోడ్స్ పూర్తీ అవ్వగా.. మూడో ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.
Next Story