Thu Jan 09 2025 00:10:47 GMT+0000 (Coordinated Universal Time)
Devara - NBK109 : ఎన్టీఆర్కి పోటీగా తన సినిమా దించుతున్న బాలయ్య..
ఎన్టీఆర్ దేవర సినిమాకి పోటీగా బాలకృష్ణ తన NBK109 చిత్రాన్ని తీసుకు వస్తున్నాడట.
Devara - NBK109 : మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని 2024 వేసవిలో ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే సినిమా షూటింగ్ ని కూడా శరవేగంగా పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతం సమ్మర్ రేసులో దేవర మాత్రమే డేట్ ఫిక్స్ చేసుకొని ఉంది. అయితే ఇప్పుడు ఈ సమ్మర్ బరిలో నిలిచేందుకు మరో నందమూరి హీరో కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ.. నేటి నుంచి NBK109 సినిమాని కూడా పట్టాలు ఎక్కించేశాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి 2024 సమ్మర్ కి తీసుకు రావాలని చూస్తున్నారట.
బాలకృష్ణ 'లెజెండ్' 2014 మార్చి 28న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాదితో పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్బంగానే NBK109 చిత్రాన్ని 2024 మార్చి 29న రిలీజ్ చేయడానికి మేకర్స్ అలోచిస్తున్నారట. ఒకవేళ ఇదే గనుక నిజమైతే నందమూరి హీరోల మధ్య పోటీ తప్పదు. ఎందుకంటే బాలయ్య మూవీ రిలీజ్ అయిన వారానికే 'దేవర' రిలీజ్ ఉంటుంది.
అయితే NBK109 రిలీజ్ వార్తలో ఎంత నిజమో ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. నందమూరి హీరోల మధ్యనే పోటీ అంటే.. కొందరు అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి బాబాయ్ అబ్బాయి నిజంగానే బాక్స్ ఆఫీస్ పోటీకి దిగుతారా..? అనేది చూడాలి. NBK109 చిత్రాన్ని సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.
Next Story