Mon Dec 23 2024 03:39:30 GMT+0000 (Coordinated Universal Time)
Balakrishna : బాలయ్య, కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్..?
బాలయ్య, కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారా..? అది కూడా భారీ పీరియాడిక్..
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాలు తరువాత పరిశ్రమకి పరిశ్రమకి మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం పోయి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, పాన్ ఇండియా ఫిలిం అనే పద్ధతి మొదలైంది. దీంతో ఒక పరిశ్రమలోని దర్శకుడు మరో ఇండస్ట్రీకి చెందిన హీరోతో సినిమా చేయడం, రెండు పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో పని చేయడం జరుగుతుంది.
తాజాగా టాలీవుడ్ నటసింహ బాలకృష్ణ, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారా..? అది కూడా భారీ పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రమా..? ఈ సందేహం ఎందుకు కలుగుతుందంటే.. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బాలయ్య, సుదీప్, టైగర్ ష్రాఫ్ వారియర్స్ గా కనిపిస్తున్నారు. ఆ వీడియో చూసే ఈ ముగ్గురు మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా..? అనే సందేహం మొదలైంది.
అయితే ఆ వీడియోని చివరి వరకు చూస్తే.. అసలు విషయం అర్ధమవుతుంది. ఈ ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తుది పోరుతో వరల్డ్ ఫీవర్ ముగిసింది. ఇక ఇప్పుడు కబడ్డీ ఫీవర్ మొదలవ్వనుంది. ప్రో కబడ్డీ లీగ్ కి కూడా దేశంలో చాలా ఫేమ్ వస్తుంది. ఐపీల్ మాదిరి ఈ కబడ్డీ లీగ్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ 10వ సీజన్ డిసెంబర్ 2 నుండి మొదలు కాబోతుంది.
గతంలో చాలామంది స్టార్స్ ఈ కబడ్డీ లీగ్ కి బ్రాండ్ అంబాసడర్స్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ సీజన్ కి బాలయ్య, కిచ్చా సుదీప్, టైగర్ ష్రాఫ్.. ఆ భాద్యతలను తీసుకున్నారు. ఇక ఈ లీగ్ గురించి ఒక ప్రమోషనల్ యాడ్ కోసం ఈ ముగ్గురు కలిసి చేసిన వీడియోనే.. ఆ పీరియాడిక్ యాక్షన్ కట్ వీడియో. ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఇది చూసిన కొంతమంది.. వీరితో నిజంగా ఒక మల్టీస్టారర్ వస్తే బాగుటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story