Mon Dec 23 2024 03:21:40 GMT+0000 (Coordinated Universal Time)
ఉగాది స్పెషల్ : NBK 108 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ సారి కామెడీ కాదంటూ..
నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో సినిమాలు, టాక్ షో, యాడ్స్.. మరోవైపు రాజకీయాలు ఇలా అన్నింటిలోనూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతేడాది అఖండ, ఈ ఏడాది వీరసింహారెడ్డి భారీ హిట్ అయ్యాయి. అన్ స్టాపబుల్ 2 షో కూడా సూపర్ సక్సెస్ అయింది. సినిమాలు, షో లు మాత్రమే కాకుండా.. వరుసగా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు NBK 108 సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కాజల్ బాలయ్యకు జంటగా నటిస్తుండగా.. శ్రీలీల ఆయన కూతురి పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ సారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటం, బాలకృష్ణ వరుస విజయాలతో జోరులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నేడు ఉగాది సందర్భంగా NBK 108 సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పై This time beyond your imagination అని పోస్ట్ చేసి ఈ సారి మీ ఊహలకు మించి సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో బాలయ్య గంభీరంగా నిల్చొని మెలేసిన మీసంతో మెడలో కండువా చుట్టుకుని ఉన్నారు. NBK 108 కూడా హిట్టై.. బాలయ్య హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story