ఆమె కోసం కోట్లు ఖర్చుపెట్టిన బాలయ్య..!
బాలకృష్ణ ఎన్ బీ కే ఫిలిమ్స్ అంటూ బ్యానర్ పెట్టి మరీ నిర్మాతగా సినిమాలు తియ్యడం మొదలుపెట్టాడు. మొదటగా తన తండ్రి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడుని ఆ [more]
బాలకృష్ణ ఎన్ బీ కే ఫిలిమ్స్ అంటూ బ్యానర్ పెట్టి మరీ నిర్మాతగా సినిమాలు తియ్యడం మొదలుపెట్టాడు. మొదటగా తన తండ్రి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడుని ఆ [more]
బాలకృష్ణ ఎన్ బీ కే ఫిలిమ్స్ అంటూ బ్యానర్ పెట్టి మరీ నిర్మాతగా సినిమాలు తియ్యడం మొదలుపెట్టాడు. మొదటగా తన తండ్రి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడుని ఆ బ్యానర్ మీదే తెరకెక్కించాడు. ఎన్ బి కె ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి సినిమా కథానాయకుడు బాలయ్య బాబుకి భారీ షాకిచ్చింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలకృష్ణ బాగానే ఖర్చు పెట్టాడు. ఎక్కడా తగ్గకుండా కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులలో నటించడానికి మంచి అంటే కాస్ట్లీ నటులనే తీసుకొచ్చాడు. అందులో బాలీవుడ్ నుండి కూడా బాలయ్య విద్యాబాలన్ ని తీసుకొచ్చాడు
మెప్పించిన విద్యా బాలన్
బసవతారకం క్యారెక్టర్ కోసం బాలకృష్ణ విద్య బాలన్ ని ఎంపిక చెయ్యగా ఆమె తెలుగులో నటించేందుకు బాలయ్యని ఏకంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో తన సీన్స్ కూడా ఎక్కువ ఉండాలనే షరతు మీదే ఆమె ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది అనే టాక్ ఆమె సైన్ చేసినప్పటి నుండే నడుస్తుంది. మరి కథానాయకుడు సినిమాలో విద్యాబాలన్ బసవతారకంగా అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బాలయ్య విద్యాని బసవతారకం క్యారెక్టర్ కి తీసుకోవడం 100 శాతం కరెక్ట్ అన్నారు అంతా. తాజాగా కథానాయకుడు లాస్ అవడంతో.. బాలయ్య అనవసరంగా విద్యా బాలన్ కోసమా 2 కోట్లు తగలేసాడంటున్నారు.
ఇక్కడి వారిని తీసుకుంటే…
ఆ క్యారెక్టర్ కి బాలీవుడ్ నుండి విద్యాని కాకుండా ఇక్కడే ఎవరో ఒకరిని పెట్టేసినట్లైతే.. లక్షల్లోనే పారితోషకం ఉండేది. అనవసరంగా విద్యాని తీసుకుని బాలయ్య కోట్లు తగలేశాడంటున్నారు. మరి విద్యా బాలన్ బసవతారకంగా నటనలో, అభినయంలో అదరగొట్టినా.. కథానాయకుడు సినిమా డిజాస్టర్ దుష్ట్యా ఇప్పుడు అంత పెట్టి విద్యని తీసుకురాకుండా ఉంటే.. నష్టం వచ్చిన మొత్తంలో కొంత మిగిలేది… బాలయ్యకు బాలీవుడ్ హీరోయిన్ మీదున్న డ్రీమ్స్ వలన కోట్లు పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ శుక్రవారం విడుల కాబోతున్న మహానాయకుడు సినిమాలో కూడా బసవతారకం హైలెట్ అవుతుందని మహానాయకుడు ట్రైలర్ లో కనబడుతుంది. మరి మహానాయకుడు హిట్ అయితే గనక ఇప్పుడు లేచిన నోర్లు అప్పుడు మూతబడే అవకాశం ఉంది.