మహానాయకుడు 24 న లేనట్టేనా?
ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సినిమాకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి కానీ రిలీజ్ డేట్ పై కొత్త అనుమానాలు మొలకెత్తుతున్నాయి. మొదటి పార్టు 'కథానాయకుడు' జనవరి 9న రిలీజ్ అవ్వడం కాయం. ఆ మేరకు ఈసినిమాను కొన్న బయర్స్ ధియేటర్ల కేటాయింపుకు గురించి థియేటర్స్ ఓనర్స్ తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే 'కథానాయకుడు' కు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.
రెండో పార్టు 'మహానాయకుడు' అదే నెల జనవరి 24 న వస్తున్నట్టు ప్రొడ్యూసర్స్ అధికారంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం 'మహానాయకుడు' రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఆఫిషల్ న్యూస్ కాకపోయినా ఇండస్ట్రీ లో ప్రస్తుతం దీని గురించే చర్చ నడుస్తుంది. దానికి కారణం కథానాయకుడికి..మహానాయకుడుకి కేవలం రెండు వారాలే గ్యాప్ ఉండటం. ఒకవేళ కథానాయకుడికి సూపర్ హిట్ టాక్ వస్తే ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు వారాల రన్ ఈజీగా వస్తుంది. ఈలోపల 'మహానాయకుడు' రిలీజ్ అయితే వసూళ్ళ మీద ప్రభావం ఉంటుంది.
సో ఎందుకులే రిస్క్ అని ఆలోచిస్తున్నారు మేకర్స్. మరోపక్క 'మహానాయకుడు' ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబందించిన సినిమా కాబట్టి అందులో చూపించే అంశాలు కరెక్ట్ గా లేకపోతే ప్రత్యర్థులకు ఈసినిమా నెగటివ్ ప్రచారానికి ఉపయోగపడే అవకాశం ఉన్నందున ఈ సినిమాను ఎలెక్షన్స్ తరువాత ప్రశాంతంగా రిలీజ్ చేసే ఆలోచనలో క్రిష్ అండ్ బాలయ్య ఉన్నట్టు సమాచారం. దానికి తోడు జనవరి 24 న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇన్ని ఇబ్బందులు మధ్య సినిమా రిలీజ్ జనవరి 24 న చేయకపోవటం బెటర్ అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి