Mon Dec 23 2024 00:48:00 GMT+0000 (Coordinated Universal Time)
విశ్వక్సేన్ను సర్ప్రైజ్ చేసిన బాలయ్య..
విశ్వక్ సేన్, బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న దగ్గర నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తాజాగా బాలయ్య..
విశ్వక్ సేన్ (Vishwak Sen), బాలకృష్ణ (Balakrishna) అన్స్టాపబుల్ షోలో పాల్గొన్న దగ్గర నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు అటెండ్ అవుతూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా బాలయ్య, విశ్వక్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడట. ప్రస్తుతం విశ్వక్ సేన్.. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs Of Godavari) అనే సినిమాని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో జరుగుతుంది.
ఇక విశ్వక్ షూటింగ్ లో ఉన్న సమయంలో బాలకృష్ణ సడన్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. బాలయ్య తమ సెట్స్ ని సందర్శించిన విషయాన్ని తెలియజేస్తూ విశ్వక్ సేన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేశాడు. "మా సెట్స్ లోకి మీరు రావడం మూవీ టీంకి అంతా ఎంతో సంతోషాన్ని పంచింది. మీరు చేస్తున్న సపోర్ట్ కి మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సార్" అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు.
అయితే మూవీలోని తన లుక్ రివీల్ అవ్వకూడదని.. కేవలం బాలయ్య ఉన్న ఫోటోలు మాత్రమే షేర్ చేశాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత మొత్తం ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫొటోల్లో బాలయ్య ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) గెటప్ లో కనిపిస్తున్నాడు. ఒక స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో పెద్ద హీరో మూవీ సెట్స్ కి వెళ్లి చిన్న హీరో కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కామన్ గా జరుగుతుంది.
అయితే ఇక్కడ బాలయ్యే, విశ్వక్ సెట్స్ కి వెళ్లడంతో అభిమానులు సోషల్ మీడియాలో బాలకృష్ణను అభినందిస్తున్నారు. ఇక భగవంత్ కేసరి విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన 'గణేష్ యాంతం' ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Next Story