Mon Dec 23 2024 11:25:53 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్యకు సర్జరీ అంటూ వార్తలు.. అబద్ధాలు-అవాస్తవాలు ప్రచారం చేశారో..?
తాజాగా బాలకృష్ణకు మరో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కొంతకాలంగా మోకాలి నొప్పితో..
హైదరాబాద్ : అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో యాక్షన్ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కుడిభుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అన్ స్టాపబుల్ షోలో కూడా ఆయన భుజానికి బ్యాండేజ్ తో కనిపించారు.
అయితే తాజాగా బాలకృష్ణకు మరో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు అంటూ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోన్న బాలకృష్ణకు వైద్యులు.. మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ మోకాలికి జరిగింది చిన్న ఆపరేషనే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారని కథనాలు వచ్చాయి. దీనిపై బాలకృష్ణ ప్రతినిధులు స్పందించారు. బాలయ్యకు సర్జరీ జరిగిందంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఆయనకు ఎటువంటి సర్జరీ ఇప్పుడు జరగలేదని.. కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని చెప్పారు. దయచేసి బాలకృష్ణ గురించి అవాస్తవ వార్తలను వ్యాప్తి చేయకూడదని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 107వ చిత్రంలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన షూటింగ్‌లోనూ బాలకృష్ణ పాల్గొన్నారు.
Next Story