Sun Dec 22 2024 19:36:15 GMT+0000 (Coordinated Universal Time)
వాటికి గుడ్ బై చెప్పేస్తున్నా అంటూ సంచలన ప్రకటన చేసిన బండ్ల గణేష్
బండ్ల గణేష్.. మాటలతోనే ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఏది మనసుకు అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. అటు నటుడిగా.. ఇటు నిర్మాతగానే కాకుండా పొలిటీషియన్ గా కూడా బండ్ల గణేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయం చవిచూసింది. షాద్ నగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన ఆయన భంగపడ్డాడు. కొందరితో అనవసరంగా గొడవలు కూడా పెట్టేసుకున్నారు. కాంగ్రెస్ పరాజయం తర్వాత బండ్ల గణేశ్ పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపించలేదు. ఇక బండ్ల గణేష్ ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ విషయంలో కాస్త ఆసక్తిని కనబరిచాడు. తాజాగా రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్, వ్యాపార పనుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బండ్ల గణేశ్ ట్విట్టర్ లో వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం కానీ, మిత్రత్వం కానీ లేవని స్పష్టం చేశారు. తనకు అందరూ ఆత్మీయులేనని, అందరినీ సమానంగా చూస్తానని అన్నారు. ఇప్పటివరకు ఎవరైనా తన వల్ల ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బాధపడి ఉంటే తనను పెద్ద మనసుతో క్షమించాలని బండ్ల గణేశ్ విజ్ఞప్తి చేశారు.
Next Story