Mon Dec 23 2024 10:26:40 GMT+0000 (Coordinated Universal Time)
బంగార్రాజు ఫస్ట్ డే కలెక్షన్స్.. ఊహించని రీతిలో వసూళ్లు
జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1300 థియేటర్లలో విడుదలైన బంగార్రాజుకు వసూళ్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు నైజామ్
2016 సంక్రాంతికి సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో రంగంలోకి దిగి.. వసూళ్లను రాబట్టిన నాగార్జున.. ఈ సంక్రాంతికి బంగార్రాజుతో బరిలోకి దిగారు. మరి బంగార్రాజు ఊహించిన రీతిలో కలెక్షన్లు రాబట్టిందా అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగార్రాజుకు మంచి వసూళ్లే వచ్చాయని చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ కావడం.. పండగ సమయంలో విడుదల.. బంగార్రాజుకు కలిసొచ్చిందట.
జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1300 థియేటర్లలో విడుదలైన బంగార్రాజుకు వసూళ్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు నైజామ్ లో రూ.3.1 కోట్ల గ్రాస్, రూ.1.73 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల బిజినెస్ 40కె డాలర్ల వరకూ జరిగిందట. ఇటు ఏపీలోనూ బంగార్రాజు బిజినెస్ బాగానే జరిగింది. మొత్తం మీద తొలిరోజు బంగార్రాజు తెలుగు రాష్ట్రాల్లోనే.. రూ.8 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా వరకూ ఆఫ్ లైన్ టికెట్ల బిజినెస్ జరగడంతో పూర్తి లెక్కలు రావాల్సి ఉంది. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.38 కోట్లు జరిగింది. ఈ లెక్కలను బట్టి చూస్తుంటే బంగార్రాజు గట్టెక్కినట్లే అని తెలుస్తోంది.
Next Story