Mon Dec 23 2024 04:20:39 GMT+0000 (Coordinated Universal Time)
బంగార్రాజు టీజర్ విడుదల.. నాగార్జున - చైతన్య అదరగొట్టేశారుగా !
న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయడంతో పాటు.. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది ప్రకటించారు. ఈ టీజర్ లో
రొమాంటిక్ ఎంటర్ టైనర్ సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమాలో కూడా నాగార్జున - రమ్యకృష్ణలు జోడీగా కనిపిస్తారు. ఇక నాగచైతన్య సరసన కృతిశెట్టి జంటగా నటించింది. ఎప్పుడెప్పుడు బంగార్రాజు సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూసే వారికి సినిమా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయడంతో పాటు.. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది ప్రకటించారు. ఈ టీజర్ లో ఈ సంక్రాంతికే బంగార్రాజు వస్తున్నాడని తెలిపారు.
తాజాగా వచ్చిన బంగార్రాజు టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాను మించి బంగార్రాజు ఉండబోతోందని టీజర్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలే కాకుండా.. యాక్షన్ అలాగే ఆధ్యాత్మిక సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కృతిశెట్టి ఊరి సర్పంచ్ గా క్యారెక్టర్ లో కనిపించగా.. నాగార్జున - నాగచైతన్య మధ్య సంబంధం ఏంటన్నది రివీల్ చేయలేదు మేకర్స్. బహుశా తాత - మనుమలుగా తండ్రి కొడుకులు కనిపిస్తారని అభిమానుల అభిప్రాయం. అలాగే మేకర్స్ చెప్పినట్లుగానే బంగార్రాజును సంక్రాంతికి చూపిస్తారా ? లేక ఆర్ఆర్ఆర్.. రాధేశ్యామ్ మాదిరిగానే వాయిదా వేస్తారా ? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి.
Next Story