Mon Dec 23 2024 14:01:15 GMT+0000 (Coordinated Universal Time)
బంగార్రాజు ట్రైలర్ విడుదల.. అదరగొట్టిన చై - నాగ్ !
మంగళవారం సాయంత్రం బంగార్రాజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకూ సినిమా నుంచి విడుదలైన
తండ్రీ కొడుకులు.. కింగ్ నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తోన్న ఫుల్ లెంగ్త్ మూవీ బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనే ట్యాగ్ లైన్ తో సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, కృతిశెట్టిలు లీడ్ రోల్స్ కనిపించే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ థియేటర్లలోకి రానుంది.
మంగళవారం సాయంత్రం బంగార్రాజు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటివరకూ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పాటలు సినిమాపై మంచి హైప్ తీసుకురాగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ బంగార్రాజుపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలయిన 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' పోస్ట్ పోన్ అవడంతో 'బంగార్రాజు' కి లైన్ క్లియర్ అయింది. జనవరి 14న సంక్రాంతి బరిలో దిగబోతున్న అక్కినేని తండ్రీకొడుకులు 'సోగ్గాడే' మ్యాజిక్ రిపీట్ చేస్తూ పక్కా బ్లాక్బస్టర్ కొడతామని ధీమాగా ఉన్నారు. కానీ.. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో ఉండటంతో బంగార్రాజు గట్టెక్కుతాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
News Summary - Bangarraju Movie Trailer Released
Next Story