Mon Dec 23 2024 08:05:55 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో బంగార్రాజు.. మరిన్ని కొత్త చిత్రాలు కూడా విడుదల
సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ఈ శుక్రవారం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా
ఈ శుక్రవారం, ఫిబ్రవరి 18వ తేదీన పలు కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదల కానున్నాయి. ఇక ఈ వీకెండ్ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునేవారికి కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ఈ శుక్రవారం ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన "బంగార్రాజు"లో నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టిలు నటించారు.
Also Read : తవ్వకాల్లో బయటపడిన చార్మినార్ భూగర్భ మెట్లు
ఈవారం ఓటీటీలో విడుదల కానున్న మరో సినిమా 83. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా '83'. ఈ సినిమా ఫిబ్రవరి 18న నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్స్టార్ లలో విడుదల కానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన 83.. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో 24 డిసెంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇదే రోజు యాక్షన్ హీరో విశాల్ నటించిన ENEMY సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుంది. సోనీ లివ్ లో ఫిబ్రవరి 18నుంచి ENEMY స్ట్రీమ్ అవ్వనుంది.
Next Story