Mon Dec 23 2024 08:39:28 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్బాస్ కంటెస్టెంట్కి గుండెపోటు.. హౌస్ నుంచి బయటకి పంపిచేసిన..
బిగ్బాస్ కంటెస్టెంట్కి గుండెపోటు రావడంతో షో నిర్వాహకులు.. ఆ కంటెస్టెంట్ ని హౌస్ నుంచి బయటకి పంపించేశారు.
బిగ్బాస్ రియాలిటీ షోని తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ లుగా ఈ రియాలిటీ షో రన్ అవుతుంది. ఇక తెలుగు సీజన్ 7తో పాటు తమిళ్ బిగ్బాస్ సీజన్ 7 కూడా ఇటీవల మొదలైంది. కాగా తాజాగా తమిళ్ బిగ్బాస్ లో ఒక కంటెస్టెంట్ కి గుండెపోటు వచ్చింది.
దీంతో ఆ కంటెస్టెంట్ ని షో నిర్వాహకులు హౌస్ నుంచి బయటకి పంపించేశారు. అక్టోబర్ 7న ఈ సీజన్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రముఖ తమిళ నటుడు మరియు రచయిత అయిన 'బావ చెల్లదురై' ఈ సీజన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే లాస్ట్ ఎపిసోడ్ లో ఆయనకి ఛాతి నొప్పి రావడంతో బాగా ఇబ్బంది పడ్డారు. హౌస్ నుంచి బయటకి పంపించేయండి అంటూ షో నిర్వాహుకులను వేడుకోవడంతో.. వారు ఆయనను బయటకి తీసుకు వచ్చేశారు.
ఈ వారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ లోని మెంబెర్స్.. బావ చెల్లదురైని నామినేట్ చేశారు. ఇక ఆ నామినేషన్స్ తో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో రాత్రి సమయంలో సడన్ గా ఛాతీలో నొప్పి వస్తుందని కంగారుపడి ఆవేదన చెందారు. ఇక చేసేది లేక షో నిర్వాహకులు ఆయనను బయటకి పంపించేశారు.
కాగా తమిళ్ బిగ్ బాస్ నుంచి ఇలా కంటెస్టెంట్స్ బయటకి వచ్చేయడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి ఏడుసార్లు ఇలా జరిగింది. సీజన్ 1,3,6,7 లో ఇలాంటి సంఘటనలు జరిగి ఆరుగురు కంటెస్టెంట్స్ బయటకి వచ్చేశారు.
Next Story