Sun Dec 22 2024 19:58:55 GMT+0000 (Coordinated Universal Time)
బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..మరోసారి సోల్జర్ గా విజయ్
కమెడియన్ యోగిబాబుతో హీరో "భయంగా ఉందా? దీని తరువాత ఇంకా భయంకరంగా ఉంటుంది" అని చెప్పినట్లు యోగి చూసిన చూపు
చెన్నై : తలపతి విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్న బీస్ట్ సినిమా తెలుగు ట్రైలర్ వచ్చేసింది. కావల్సినన్ని కాల్పులు, లెక్కలేనన్ని కత్తులు కటార్లు ట్రైలర్లో కనిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితమే సినిమా తమిళ ట్రైలర్ విడుదలవ్వగా, నేడు తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో కళానిధి మారన్ 'బీస్ట్' చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ విషయానికొస్తే.. కొందరు టెర్రరిస్టులు ఓ షాపింగ్ మాల్ ను తమ అదుపులోకి తీసుకోగా.. అదేమాల్ లో ఉన్న హీరో వారందరినీ తన స్టైల్లో చితకబాది జనాన్ని రక్షిస్తాడు. ఇది క్లియర్ కట్ గా ట్రైలర్ లో తెలిసిపోతుంది. పూజా హెగ్డే ట్రైలర్ లో అంతగా కనిపించలేదు.
కమెడియన్ యోగిబాబుతో హీరో "భయంగా ఉందా? దీని తరువాత ఇంకా భయంకరంగా ఉంటుంది" అని చెప్పినట్లు యోగి చూసిన చూపు నవ్వులు పూయిస్తుంది. విజయ్ డైలాగ్స్ ను బట్టి చూస్తే.. అతనికి పాలిటిక్స్ పెద్దగా ఇంట్రస్ట్ లేదని తెలిసిపోతుంది. ఓ చోట రాజకీయ నాయకుల ప్రస్తావన కూడా తెచ్చి, "మీరు చేసే ఈ రాజకీయ ఆటలంతా నాకు సెట్ అవ్వవు.. బికాజ్ ఐ యామ్ నాట్ ఏ పొలిటీషియన్.. ఐయామ్ ఎ సోల్జర్" అని చెప్పే డైలాగ్స్ లో అసలు కథ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏప్రిల్ 13న జనం ముందు నిలవబోతున్న 'బీస్ట్' ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
Next Story