Thu Jan 16 2025 04:42:57 GMT+0000 (Coordinated Universal Time)
మోడల్ ను పిలుచుకొని వచ్చారు.. స్ప్రే చేయగానే డ్రెస్
ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మోడల్ తన శరీరంపై స్ప్రే చేయడానికి ముందు లోదుస్తులు తప్ప మరేమీ
ప్రపంచ ప్రఖ్యాత మోడల్ బెల్లా హదీద్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందనే కదా.. బెల్లా అందరి ముందు వచ్చి నిలబడింది. ఇంతలో ఓ బృందం ఆమె మీదకు ఒక రకమైన తెలుపు రంగు స్ప్రే చేశారు. అలా స్ప్రే చేసిన కొన్ని నిమిషాల లోనే ఆ స్ప్రే కాస్త డ్రెస్ గా మారిపోయింది. పక్కనే ఉన్న స్టైలిస్ట్ వచ్చి ఆమె డ్రెస్ ను సర్దింది. ఇక బెల్లా హదీద్ హొయలొలికిస్తూ ర్యాంప్ వాక్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారిపోయింది. డ్రెస్ లను సృష్టించడంలో ఇదొక కొత్త ఒరవడి అయిందని చెప్పుకొంటూ ఉన్నారు.
ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ మోడల్ తన శరీరంపై స్ప్రే చేయడానికి ముందు లోదుస్తులు తప్ప మరేమీ ధరించలేదు. 25 ఏళ్ల మోడల్ లోదుస్తులు, హీల్స్ తప్ప మరేమీ లేకుండా కనిపించింద. ముగ్గురు పురుషుల బృందం ఆమె శరీరంపై స్ప్రే చేసింది. ఈ దుస్తులు ఫ్యాబ్రికాన్తో తయారు చేయబడ్డాయి, ఇది స్ప్రే-ఆన్ మెటీరియల్ అని.. క్షణాల్లో గట్టిపడుతుందని నిపుణులు తెలిపారు.
Next Story