Mon Dec 23 2024 12:31:12 GMT+0000 (Coordinated Universal Time)
ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న బెల్లంకొండ 'ఛత్రపతి'
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ని రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ని రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. వీవీ వినాయక్ ఈ సినిమాను బాలీవుడ్లో తెరకెక్కించారు. థియేటర్లలో మే 12న రిలీజైన ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. అప్పటికే ఈ సినిమాను యూట్యూబ్ లో అందరూ చూసేయడం.. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా విడుదల లేట్ అవ్వడంతో సినిమాకు రెస్పాన్స్ రాలేదు.
దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రీమేక్ రూ.5 కోట్లలోపే వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు గుడ్ న్యూస్. ఆగస్ట్ 18న సినిమా ఓటీటీ రిలీజ్ పెట్టుకుంది. జీ5 ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది.
బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా నుష్రత్ బరుచా హీరోయిన్గా నటించింది. థియేటర్లలో మే 12న ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ అనుకున్న సక్సెస్ అందుకోలేదు. ఛత్రపతి తెలుగు వెర్షన్‌కు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ప్రభాస్ హీరోగా 2005లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ ను స్టార్ చేసిన సినిమా ఛత్రపతి.
Next Story