Thu Jan 16 2025 02:57:20 GMT+0000 (Coordinated Universal Time)
‘కవచం’తో వస్తున్న బెల్లంకొండ
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'కవచం' సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి 9 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన రాగ సినిమాపై అంచనాలను పెంచేసింది. థ్రిల్లర్ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహించారు. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తుండగా హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయ్యింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, చోట కె నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
Next Story