రాక్షసుడు టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు [more]
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు [more]
డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రైడ్, వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఎ హవీష్ లక్ష్మణ్ కొనేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'రాక్షసుడు'. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూలై 18న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది.
'దిస్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ యాంటీ సోషల్ డిజార్డర్’..
సింపుల్‌గా చెప్పాలంటే వాడొక సైకో.. వాడికి నొప్పంటో ఏంటో తెలియదనుకుంటా…రాక్షసుడు' అనే డైలాగ్ తప్ప మరే డైలాగ్ లేదు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు సూర్య, ఓ చిన్నపాప .. టీజర్లో కనపడే పాత్రలు.
చిన్న పిల్లలను ముఖ్యంగా అమ్మాయిలను క్రూరంగా హింసించి చంపే ఓ సైకోను పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గేమ్ ఇది అని టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత హవీష్ కొనేరు మాట్లాడుతూ – “తమిళంలో సూపర్‌డూపర్‌హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్లో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని రమేష్‌వర్మగారు డైరెక్ట్ చేస్తున్నారు. మేకింగ్ లో కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . బెల్లంకొండ శ్రీనివాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూలై 18న విడుదల చేస్తున్నాం“ అన్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రచన: సాగర్, ఆర్ట్: గాంధీ నడికొడికర్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సంగీతం: జిబ్రాన్, నిర్మాత: సత్యనారాయణ కొనేరు, దర్శకత్వం: రమేష్ వర్మ పెన్మత్స.