బెల్లంకొండ సుడి తిరగనుందా?
బెల్లంకొండ శ్రీనివాస్ ఇంతకాలం ఒక హిట్ కూడా లేకుండా నెట్టుకొస్తున్నాడు అంటే అతని డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ మార్కెట్ ఎక్కువ. ఇతని సినిమాకి ఈజీగా 10 [more]
బెల్లంకొండ శ్రీనివాస్ ఇంతకాలం ఒక హిట్ కూడా లేకుండా నెట్టుకొస్తున్నాడు అంటే అతని డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ మార్కెట్ ఎక్కువ. ఇతని సినిమాకి ఈజీగా 10 [more]
బెల్లంకొండ శ్రీనివాస్ ఇంతకాలం ఒక హిట్ కూడా లేకుండా నెట్టుకొస్తున్నాడు అంటే అతని డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ మార్కెట్ ఎక్కువ. ఇతని సినిమాకి ఈజీగా 10 నుండి 12 కోట్లు వరకు ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా వస్తున్నాయి. కానీ సీత సినిమాతో బెల్లంకొండ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయిందని అర్ధం అవుతుంది. కారణం ఈసినిమాను హిందీ డబ్బింగ్, శాటిలైట్ కొన్న బయ్యర్ చివరి నిమిషంలో కోటి నుంచి రెండు కోట్ల వరకు తక్కువ కట్టినట్లు తెలుస్తోంది. కారణం ముందు చెప్పినట్టు సీత సినిమాలో ఆరు ఫైట్స్ ఉంటాయి అని చెప్పి చివరికి రెండు ఫైట్స్ తో సినిమా రిలీజ్ చేయడంతో ఏదో పంచాయతీ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
సీత ఎఫెక్ట్….
దీని ఎఫెక్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే రాక్షసుడు పై పడింది. ఈసినిమాను మొదట 12 కోట్లకు హిందీ హక్కులు కొనడానికి ఓకే అనిపించుకుని, రెండు కోట్లు అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్, ఇప్పుడు ఆరుకోట్లు మాత్రమే కడతానని అంతకు మించి తన వల్ల కాదని మొహం మీద చెప్పేశాడట. ఈ కండిషన్ మేకర్స్ కి నచ్చకపోతే తన అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయమని పట్టుపడుతున్నట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. సో ఇవ్వన్నీ పోవాలంటే రాక్షసుడు కచ్చితంగా హిట్ అవ్వాలి. లేకపోతే ఫ్యూచర్ లో సాయి తో సినిమాలు చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకి రాడు.