ఎట్టకేలకు బెల్లంకొండ కొట్టాడండి
ఇప్పటివరకు భారీ బడ్జెట్స్ తో భారీ హీరోయిన్స్ తో సినిమాలు చేసే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి తక్కువ బడ్జెట్ తో సేఫ్ ఆడాలనుకున్నాడు. ఎప్పుడూ రిచ్ [more]
ఇప్పటివరకు భారీ బడ్జెట్స్ తో భారీ హీరోయిన్స్ తో సినిమాలు చేసే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి తక్కువ బడ్జెట్ తో సేఫ్ ఆడాలనుకున్నాడు. ఎప్పుడూ రిచ్ [more]
ఇప్పటివరకు భారీ బడ్జెట్స్ తో భారీ హీరోయిన్స్ తో సినిమాలు చేసే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి తక్కువ బడ్జెట్ తో సేఫ్ ఆడాలనుకున్నాడు. ఎప్పుడూ రిచ్ గా సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ కి హిట్ అనే పదం అందని కలగానే మిగిలిపోయింది. అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, కవచం, సాక్ష్యం, సీత అన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే. అందులోను టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసినా మనోడికి ఫేమ్ రాలేదు. ఇక లాభంలేదనుకున్న బెల్లంకొండ ఈసారి ఓ హిట్ రీమేక్ నే నమ్ముకున్నాడు. తమిళనాట క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన రచ్చసన్ సినిమాని తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేసాడు బెల్లంకొండ. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో రీమేక్ చేశారు.
ఇక దర్శకుడు రమేష్ వర్మ కుడా లో బడ్జెట్ లో తమిళ రచ్చసన్ ని యాజిటీజ్ గా తెలుగులోకి కాపీ పేస్ట్ చేసాడు. నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన రాక్షసుడు సినిమాకి మొదటి షోకే హిట్ టాక్ పడింది. తమిళ రచ్చసన్ గనక వీక్షించని ప్రేక్షకులకు తెలుగు రాక్షసుడు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మాతృకని ఎక్కడా చెడగొట్టకుండా రమేష్ వర్మ ఈ రీమేక్ కంప్లీట్ చేసాడు. సినిమాలో బెల్లకొండ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకోవడమే కాదు… ఎమోషనల్ సీన్స్ లోను మంచి నటన కనబర్చాడు. ఇక సినిమాకి మరో మెయిన్ హైలెట్ కథ. అలాగే జిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం. ఇంకా సినిమాటోగ్రఫీ ఇలా చాలా ప్లస్ పాయింట్స్ తో రాక్షసుడు సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ప్రేక్షకులే కాదు, రివ్యూ రైటర్స్ కూడా సినిమాకి మంచి మార్కులేసేసారు. ఇక రాక్షసుడు సినిమా రేపు 9 న విడుదలకాబోతున్న నాగార్జున మన్మధుడు 2 వచ్చేవరకు కలెక్షన్స్ దున్నేసుకోవడమే. మరి డైరెక్ట్ గా చేసిన సినిమాలకన్నా ఓ రీమేక్ బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ నే మార్చేసింది.