Mon Dec 23 2024 23:10:05 GMT+0000 (Coordinated Universal Time)
క్యాన్సర్ పోరాడి గెలిచిన యువ నటి కన్నుమూత
20 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు ఆండ్రిలా కన్నుమూసింది. ఆండ్రిలా మృతితో.. బెంగాలీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం..
చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. క్యాన్సర్ పోరాడి గెలిచిన ఆ యువ నటిని గుండెపోటు రూపంలో మరణం కబళించింది. ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ (24) గుండెపోటుతో కన్నుమూశారు. ఇప్పటికే పలుమార్లు గుండెపోటుకు గురైన ఆండ్రిలా.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్ కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నవంబర్ 1న ఆమె బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడంతో.. కుటుంబ సభ్యులు హౌరాలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో రక్తస్రావం అవడంతో.. ఆండ్రిలా కోమాలోకి వెళ్లింది. 20 రోజులుగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
20 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు ఆండ్రిలా కన్నుమూసింది. ఆండ్రిలా మృతితో.. బెంగాలీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆండ్రిలా అకాలమరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం తెలుపుతున్నారు. ఆండ్రిలా ఇప్పటికే రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడింది. వరుస గుండెపోటులతో అల్లాడి.. ఆఖరికి విధి ఆడిన వింతనాటకంలో ప్రాణాలు విడిచింది. 2015లో ఇంటర్ చదువుతున్న సమయంలో తొలిసారిగా అండ్రిలా క్యాన్సర్ బారిన పడింది. ఆ తర్వాత 2021 లో మరోసారి ఊపిరితిత్తులో క్యాన్సర్ ఏర్పడింది. ఓవైపు క్యాన్సర్ తో పోరాడుతూనే నటన కొనసాగించింది.
Next Story