Fri Dec 20 2024 05:53:09 GMT+0000 (Coordinated Universal Time)
2023 Rewind : 2023లో బాగా వైరల్ అయిన మీమ్స్ ఇవే..
2023లో బాగా వైరల్ అయిన విషయాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
2023 Rewind : సోషల్ మీడియా యూసేజ్ బాగా పెరగడంతో నెట్టింట ఏది ఎలా వైరల్ అవుతుందో తెలియడం లేదు. ఇక ఆ వైరల్ అయిన దానిని మీమర్స్ తమ మీమ్స్ తో ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చేస్తున్నారు. అలా 2023లో బాగా వైరల్ అయిన విషయాలు ఏంటో ఓ లుక్ వేసేయండి.
అది ద సార్..
తమిళ హీరో విజయ్ నటించిన 'వారసుడు' నిర్మించిన దిల్ రాజు.. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళంలో మాట్లాడారు. ఈక్రమంలోనే దిల్ రాజు మాట్లాడిన కొన్ని పదాలు బాగా వైరల్ అయ్యాయి. ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కుమ్, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుక్కుమ్, అది దా సార్.. అనే పదాలు జనవరిలో తెగ వైరల్ అయ్యాయి.
మోడల్..
మోడల్ మోడల్ సూపర్ మోడల్ అనే సాంగ్ ఫిబ్రవరిలో తెగ వినిపించింది.
కష్టపడిన, పాల్ అమ్మిన..
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. కష్టపడిన, పాల్ అమ్మిన, పూలు అమ్మిన అనే పదాలు బాగా వైరల్ అయ్యాయి.
అడ్రెస్స్ పెట్టు..
సోషల్ మీడియా వచ్చాకా ఫ్యాన్స్ వార్ బాగా ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలోనే ఒక హీరోకి చెందిన అభిమాని మరో అభిమానితో గొడవ పడుతూ.. 'అడ్రెస్స్ పెట్టు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తూ కాల్ రికార్డింగ్ బాగా వైరల్ అయ్యింది.
డిగ్రీ ఉండాలి..
సినిమా చూసి వచ్చిన ఓ ప్రేక్షకుడు తన రివ్యూని ఇస్తూ.. ఇది కింద స్థాయి వారికీ అర్ధం కాదు. ఇది అర్ధం కావాలంటే మినిమం డిగ్రీ కావాలి అని చెప్పిన పదాలు బాగా ట్రెండ్ అయ్యాయి.
కమ్ టు మై రూమ్..
ఆదిపురుష్ ట్రైలర్ చూశాక గ్రాఫిక్స్ పై అనేక విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ని.. 'కమ్ టు మై రూమ్' అని పిలిచిన పదం కూడా బాగా వైరల్ అయ్యింది.
వీడియో ఉంటే పెట్టండి..
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన 'బేబీ' మూవీ సక్సెస్ ఇంటర్వ్యూల్లో.. ఆడియన్స్ చేసిన ట్వీట్స్ ని విరాజ్ చదివారు. ఈ క్రమంలోనే మూవీలో.. 'వైష్ణవితో ఆ గంట వీడియో ఉంటే పెట్టండి బ్రో' అనే ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
కుర్చీ మడతపెట్టి..
హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండే ఓ తాత చెప్పిన 'కుర్చీ మడతపెట్టి' అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. మహేష్ బాబు ఆ డైలాగ్ పాట చేసేంత.
అ.. ఆ..
విజయ్ దేవరకొండ 'ఖుషీ' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్ లో సింగర్ 'సిద్ శ్రీరామ్'.. అ ఆ అంటూ తీసిన రాగాలు బాగా వైరల్ అయ్యాయి.
మోదీ సాంగ్స్..
AI టెక్నాలజీతో ఏవేవో అద్భుతాలు సృష్టిస్తుంటే, మన వారు మాత్రం వాటితో మోదీతో పాటలు పాడించి వైరల్ చేశారు.
లైక్ ఏ వావ్..
చీరలు అమ్ముకుంటూ ఓ వ్యాపారి చెప్పిన 'సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లూకింగ్ లైక్ ఏ వావ్'.. అనే పదం బాగా ట్రెండ్ అయ్యింది.
జమాల్ కుడు..
యానిమల్ మూవీలోని బాబీ డియోల్ ఎంట్రీ టైములో వచ్చే 'జమాల్ కుడు' సాంగ్ బాగా ట్రెండ్ అయ్యింది.
Next Story