Mon Dec 23 2024 07:26:48 GMT+0000 (Coordinated Universal Time)
Bhagavanth Kesari : రికార్డు క్రియేట్ చేస్తున్న బాలకృష్ణ భగవంత్ కేసరి
ఈ మూవీ గురించిన ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది
Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల (Sreeleela) ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. చివరి దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే, ఈ మూవీ గురించిన ఒక న్యూస్ ఫిలిం వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం సుమారు 70 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్ లో ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి. అంతేకాదు ట్రైలర్ కూడా ఆడియన్స్ ముందుకు రాకముందే, అదికూడా సినిమా విడుదలకు రెండు నెలలు ముందే డీల్ క్లోజ్ అవ్వడం.. ఇప్పటి సీనియర్ హీరోల కెరీర్ లో రికార్డు అనే చెప్పాలి.
ఇక ఒక థియేట్రికల్ రైట్సే 70 కోట్లకు అమ్ముడు పోయిని అంటే, ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు కలుపుకొని ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు పైగా జరగడం ఖాయం. బాలయ్య గత రెండు సినిమాల కలెక్షన్స్ 100 కోట్ల మార్క్ దాటడమే.. ఇంతటి ప్రీ రిలీజ్ బిజినెస్ కి కారణమని తెలుస్తుంది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
కాగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న బాలయ్య.. ఈ మూవీతో ఎలాగైనా హిట్టు కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ప్లాప్ లేకుండా వస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తన విజయ పరంపరని అలాగే కొనసాగించాలని చూస్తున్నాడు. మరి వీరిద్దరి కల నెరవేరుతుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story