Thu Jan 09 2025 18:46:58 GMT+0000 (Coordinated Universal Time)
సీమ ఫ్యాక్షన్ లవ్ స్టోరీతో భైరవగీత
భైరవగీత సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చింది. ధనంజయ, ఇర్రా మోర్ జంటగా నటించిన ఈ రాయలసీమ ఫ్యాక్షన్ లవ్ స్టోరీని 23 ఏళ్ల కొత్త దర్శకుడు సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవిశంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉండటం విశేషం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, భాస్కర్ రిషి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 14న భైరవగీత విడుదల కానుంది.
Next Story