Mon Dec 23 2024 17:27:43 GMT+0000 (Coordinated Universal Time)
మెగా ట్రీట్.. 'భలే భలే బంజారా' సాంగ్ విడుదల
తండ్రి కొడుకులు 'భలే భలే బంజారా' పాటకు గ్రేస్ గా స్టెప్పులేసి అభిమానులను అలరించారు. ఆరుపదుల వయసులోనూ..
హైదరాబాద్ : ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ మెగా కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా ఆచార్య నుంచి 'భలే భలే బంజారా' లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చిందేశారు.
తండ్రి కొడుకులు 'భలే భలే బంజారా' పాటకు గ్రేస్ గా స్టెప్పులేసి అభిమానులను అలరించారు. ఆరుపదుల వయసులోనూ చిరంజీవి రామ్ చరణ్ తో ఈక్వల్ గా స్టెప్పులేయడం విశేషం. చెప్పాలంటే చెర్రీ కంటే.. చిరు వేసిన స్టెప్పులే హైలెట్ గా నిలుస్తాయని టాక్. ఈ పాట మెగా ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్. చాలా రోజులకు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం వారికి సంతోషాన్ని కలిగిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ ప్రో కంపెనీ నిర్మించింది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇద్దరు హీరోలకు జతగా నటించారు.
Next Story