Mon Dec 23 2024 13:36:50 GMT+0000 (Coordinated Universal Time)
సిరుత పులుల సిందాట.. ఆచార్య నుంచి 'భలే భలే బంజారా' పాట ప్రోమో
'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఆచార్యలో చిరంజీవికి జోడిగా..
కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా నుంచి భలే భలే బంజారా అనే పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. పూర్తి పాటను ఏప్రిల్ 18 సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. 'సిరుత పులుల సిందాట' అంటూ సాగే 'భలే భలే బంజారా' గీతం ప్రోమో వీడియోను కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఆచార్యలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఏప్రిల్ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 24న విజయవాడలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Next Story