Mon Dec 23 2024 11:17:19 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్.. వసూళ్ల సునామీ
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ జీఎస్టీ రిటర్న్స్ తో కలిపి రూ.108 కోట్ల వరకూ జరిగినట్లు సమాచారం. రిలీజ్ అయిన ఫస్ట్ డే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న విడుదలైంది. ప్రీమియర్ షో లతోనే పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక పవన్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. సినిమా పై పాజిటివ్ టాక్ రావడంతో.. భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమా తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే.. భీమ్లా నాయక్ ప్రపంచ వ్యాప్తంగా 1900 థియేటర్లలో విడుదలైంది. ఒక్క యూఎస్ఏ లోనే 400 కి పైగా థియేటర్లలో విడుదలవ్వగా.. 3 వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ జీఎస్టీ రిటర్న్స్ తో కలిపి రూ.108 కోట్ల వరకూ జరిగినట్లు సమాచారం. రిలీజ్ అయిన ఫస్ట్ డే దాదాపు రూ.35-40 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.26కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఓవర్సీస్ లో రూ.50-55 కోట్ల వరకూ వసూళ్లు అయిఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిని బట్టి భీమ్లా నాయక్ థియేట్రికల్ రన్ లో సుమారు రూ.140-160 వరకూ కలెక్షన్లు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా ఓటీటీ హక్కులు కూడా రూ.100 కోట్లకు అమ్ముడుపోయే అవకాశాలున్నట్లు సమాచారం.
Next Story