Mon Dec 23 2024 08:55:47 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీలో భీమ్లా నాయక్.. ఎప్పుడు ? ఎందులో ?
థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించిన భీమ్లా నాయక్.. ఇక ఇంట్లోనే ఉన్నవారి చేత ఆహా అనిపించేందుకు..
హైదరాబాద్ : ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన భీమ్లా నాయక్.. ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేలా చేస్తోంది. భీమ్లా నాయక్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు రూ.150 కోట్లు దాటగా.. మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈసినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. త్వరలోనే భీమ్లా నాయక్ ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది.
Also Read : జెనీలియా రీ ఎంట్రీ..
థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించిన భీమ్లా నాయక్.. ఇక ఇంట్లోనే ఉన్నవారి చేత ఆహా అనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి నెలాఖరులోపు భీమ్లా నాయక్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. వారానికో సినిమా కాన్సెప్ట్ తో సినిమాపురాన్ని సిద్ధం చేసింది ఆహా ఓటీటీ. కొత్త కొత్త సినిమాల స్ట్రీమింగ్ తో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది.
Next Story