Mon Dec 23 2024 16:47:18 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతి బరి నుంచి భీమ్లానాయక్ అవుట్.. కారణం అదేనా ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో చంద్ర సాగర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు తెలుగులో రీమేక్ గా రానుంది భీమ్లానాయక్. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇంకా జరుగుతుండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా మొదలు కాకపోవడంతో.. మరోసారి భీమ్లానాయక్ వాయిదా పడింది.
ఇక శివరాత్రికే !
ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా, పవర్ స్టార్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురయింది. సంక్రాంతికి పవర్ స్టార్ సినిమాతో పండుగ చేసుకోవాలన్న అభిమానులకు చిత్రయూనిట్ షాకిచ్చింది. ఇంకా సినిమా పనులు పూర్తి కాకపోవడంతో.. విడుదల కాస్త ఆలస్యమవుతుందని మేకర్స్ వెల్లడించారు. శివరాత్రి కానుకగా.. ఫిబ్రవరి 25వ తేదీన భీమ్లానాయక్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్.. మరోవైపు రాధేశ్యామ్.. రెండు పాన్ ఇండియా సినిమాలు ఈ సంక్రాంతికే బరిలోకి దిగుతుండటం కూడా భీమ్లా నాయక్ వాయిదాకు ఒక కారణమని తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. తమన్ మ్యూజిక్ చేసిన పలు పాటలు ఇప్పటికే విడుదలై సినిమాపై సూపర్ డూపర్ అప్లోజ్ తీసుకొచ్చాయి. మరి ఫిబ్రవరిలోనైనా భీమ్లా నాయక్ విడుదలవుతుందా ? ఆ సమయం వచ్చేసరికి మేకర్స్ మళ్లీ వాయిదా వేస్తారా ? అన్నది చూడాలి.
Next Story