Mon Dec 23 2024 02:35:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్.. ఫ్యాన్స్ కు పండగే !
సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాకపోవడం, కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే...
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడల్లా ఏదొక అవాంతరం ఎదురవుతూనే ఉంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఫైనల్ షెడ్యూల్ పూర్తి కాకపోవడం, కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మేకర్స్ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఫిబ్రవరి 25న, లేకపోతే ఏప్రిల్ 1న సినిమా విడుదల చేస్తామని రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు. దాంతో సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో అర్థంకాక అయోమయంలో పడ్డారు అభిమానులు.
Also Read : ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత
తాజాగా ఈ సినిమా తుది విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. ముందుగా అనుకున్నట్లే ఫిబ్రవరి 25నే సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఫిబ్రవరి 25న థియేటర్లలో పవర్ తుఫాను చూస్తారంటూ ట్వీట్ చేసింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ నటించగా.. విలన్ గా రానా నటించారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
News Summary - Bheemla Nayak Release Date Confirmed. the movie releasing in theatres on february 25th
Next Story