Mon Dec 23 2024 19:23:15 GMT+0000 (Coordinated Universal Time)
రానా బర్త్ డే స్పెషల్.. భీమ్లా నాయక్ నుంచి కొత్త అప్ డేట్
రానా బర్త్ డే సందర్భంగా భీమ్లా నాయక్ మూవీ మేకర్స్ రానా పోస్టర్ ను విడుదల చేసి, బర్త్ డే విషెస్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారలుగా తెరకెక్కుతోన్న సినిమా భీమ్లా నాయక్. మలయాళం సినిమా 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ గా వస్తోన్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు, రానా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వివిధ పాటలు, టీజర్లు రిలీజ్ అయి.. అంచనాలను పెంచేశాయి. పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో రానా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజాగా రానా బర్త్ డే సందర్భంగా మేకర్స్ రానా పోస్టర్ ను విడుదల చేసి, బర్త్ డే విషెస్ తెలిపారు.
మరో అప్ డేట్ సాయంత్రం
ఆ పోస్టర్ లో రానా తన స్టైల్ లో సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు భీమ్లా నాయక్ నుంచి మరో అప్ డేట్ ను విడుదల చేస్తామని ఈ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. డానియల్ శేఖర్తో ఎన్కౌంటర్కు సిద్ధంగా ఉండాలని పోస్ట్ చేసింది. సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. సంక్రాంతికి బరిలోకి దిగనున్న ఈ సినిమా పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది.
- Tags
- bhimla naik
- rana
Next Story