Sat Dec 28 2024 20:27:29 GMT+0000 (Coordinated Universal Time)
అడ్డంకులు లేవు.. భోళా శంకర్ విడుదల కన్ఫర్మ్
మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి
మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. భోళాశంకర్ సినిమా విడుదలపై వేసిన పిటిషన్ ను సిటీ సివిల్ కోర్ట్ డిస్మిస్ చేసింది. దీంతో యధావిధిగా అనుకున్న డేట్ కు భోళా శంకర్ సినిమా విడుదల కానుంది. చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లెక్కారు. గురువారం సాయంత్రం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భోళా శంకర్ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో అక్కినేని సుశాంత్, కీర్తి సురేష్ కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం భోళా శంకర్. ఆగష్టు 11న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అయింది. దర్శకుడు మెహర్ రమేష్ సక్సెస్ అందుకుంటాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు తనకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని గతంలో అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు గాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టుకు వైజాగ్ సతీష్ వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భోళా శంకర్ విడుదలకు అడ్డు చెప్పలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు యథాతథంగా రిలీజ్ కానుంది.
Next Story