Mon Dec 23 2024 13:23:42 GMT+0000 (Coordinated Universal Time)
షికారుకొచ్చిన షేర్ ని : భగ భగ భగ భోళా
స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై. నాకు హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్ అంటూ చివరిలో చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి - తమన్నా జంటగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో ..సుశాంత్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా భోళాశంకర్ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలంగాణ భాషలో సినిమా ఉండబోతుందని టీజర్ ను బట్టి తెలుస్తుంది.
స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై. నాకు హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్ అంటూ చివరిలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మెహర్ రమేష్ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా కావడంతో.. భారీ హిట్ కొట్టాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 11న భోళాశంకర్ విడుదల కానుంది. ఈ రీమేక్ సినిమాతో.. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో చూడాలి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య.. తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అయితే.. చిరంజీవి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టే.
Next Story