Tue Dec 24 2024 13:27:07 GMT+0000 (Coordinated Universal Time)
భోళాశంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ ఏడాదికి లేనట్టే!
కొత్తపోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసింది నిర్మాణ సంస్థ. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న భోళాశంకర్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే చిరంజీవి బర్త్ డే, సినిమాలకు సంబంధించిన ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. సాయంత్రం గాడ్ ఫాదర్ టీజర్ ను విడుదల చేయనుంది ఆ చిత్రబృందం. ఇదిలా ఉండగా.. చిరంజీవి హీరోగా తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం భోళా శంకర్ నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్షన్, మాస్ అంశాలను జోడిస్తూ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
కొత్తపోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసింది నిర్మాణ సంస్థ. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న భోళాశంకర్ లో కీర్తిసురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుండగా.. తమన్నా ఆయన సరసన నటిస్తోంది. ఆదివారం విడుదలచేసిన కొత్త పోస్టర్లో కీచైన్ తిప్పుకుంటూ నడిచి వస్తూ స్టైలిష్ లుక్ లో చిరంజీవి కనిపిస్తున్నాడు. 2023 ఏప్రిల్ 14న భోళాశంకర్ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తొలుత ఈ సినిమాను సెప్టెంబర్ 10 2022 రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలిసింది.
News Summary - bhola shankar release date and megastar new poster from ak entertainments
Next Story