Mon Dec 23 2024 03:51:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాన్స్ కోరుకున్న పాట ఇచ్చావుగా భోళా శంకర్
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'జామ్ జామ్ జజ్జనక' అంటూ సాగే పాట
మెహర్ రమేష్-మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భోళా శంకర్. తమిళ హిట్ వేదాళం సినిమాను రీమేక్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య తో మాస్ హిట్ ఇచ్చిన చిరంజీవి.. భోళా శంకర్ తో హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తారని అందరూ నమ్ముతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు మంచి రెస్పాన్స్ ను తెచ్చిపెట్టాయి. ఇటివలే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమాకు సంబంధించిన పాటలు కూడా వరుసగా వచ్చేస్తున్నాయి.. మెగా అభిమానులు స్టెప్స్ వేసేస్తూ ఉన్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'జామ్ జామ్ జజ్జనక' అంటూ సాగే పాట బాగా ఆకట్టుకుంటూ ఉంది. మహతి స్వరసాగర్ స్వర పరిచిన ఈ ట్యూన్‌కు అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వోకల్స్ అందించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. పాట చాలా కలర్ఫుల్గా, గ్రాండియర్‌గా కనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి బాగుంది.. థియేటర్లలో ఫుల్ జోష్ నింపే సాంగ్ ఇది. ఈ సెలబ్రేషన్ సాంగ్ ఛార్ట్ బస్టర్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. తమన్నా హీరోయిన్గా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఆగస్టు 11న సినిమా విడుదల కాబోతోంది.
Next Story