Sat Dec 21 2024 00:04:30 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 7 : ఎలిమినేట్ అయిన భోలె ఎంత సంపాదించాడో తెలుసా..?
వైల్డ్ కార్డుతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఐదు వారలు ఇంటిలో ఉంది ఎంత సంపాదించాడో తెలుసా..?
BiggBoss 7 : తెలుగు బిగ్బాస్ సీజన్ 7 తొమ్మిది వారలు పూర్తి చేసుకొని 10వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సీజన్ లో ఎలిమినేషన్స్ చాలా ఇంటరెస్టింగా సాగుతున్నాయి. సీజన్ ఫస్ట్ హాఫ్ లో వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అయితే, సెకండ్ హాఫ్ లో అందరూ అబ్బాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో శివాజీ, యవర్, గౌతమ్, భోలె, రతిక ఉన్నారు. వీరిలో భోలె ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేశారు.
వైల్డ్ కార్డుతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. కేవలం ఐదు వారలు మాత్రమే హౌస్ లోనే ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో భోలె కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడంతో అతను బయటకి రావడం తప్పలేదు. అంతేకాదు అమ్మాయిలతో గొడవలు, హౌస్ లో బూతులు మాట్లాడడం వంటివి భోలెకి మైనస్ గా మారాయి. ఇక ఐదు వారలు లోపల ఉన్న భోలె.. గట్టిగానే సంపాదించినట్లు తెలుస్తుంది. ఇంతకీ భోలె రెమ్యూనరేషన్ ఎంత..?
తన పాటలతో టాలీవుడ్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న భోలె.. రోజుకి రూ.35 వేల రెమ్యూనరేషన్ చొప్పున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే వారానికి సుమారు రూ.2.5 లక్షల పారితోషకం అందుకున్నట్లు సమాచారం. దీని బట్టి లెక్కవేసుకుంటే.. ఐదు వారలు హౌస్ లో ఉన్న భోలె దాదాపు రూ.12 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పాటలతో అలరించిన భోలె.. ఆడియన్స్ లో మంచి ఫేమ్ నే సంపాదించుకున్నారు.
ఇక ఈ వారం ఎలిమినేషన్తో.. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. శివాజీ, ప్రశాంత్, గౌతమ్, అశ్విని, అర్జున్ అంబటి, యావర్, అమర్ దీప్, రతికారోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్.. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఉన్న వారంతా ఆల్మోస్ట్ అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఇప్పటి నుంచి ఆట మరింత రసవత్తరంగా మారనుంది.
Next Story