Tue Dec 24 2024 02:47:23 GMT+0000 (Coordinated Universal Time)
బిచ్చగాడు 2.. తొలి మూడురోజుల కలెక్షన్లు
బిచ్చగాడు సినిమాకు శశి దర్శకత్వం వహించగా.. బిచ్చగాడు 2 సినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా..
విజయ్ ఆంటోని హీరోగా బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా బిచ్చగాడు 2. ఈ సినిమా మే 19వ తేదీన విడుదలై.. తొలిరోజు తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మూడ్రోజుల్లో ఈ సినిమా రూ.9.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా చెబుతూ.. చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది. విజయ్ ఆంటోని నుంచి వచ్చిన బిచ్చగాడు భారీ విజయాన్ని సాధించడంతో.. బిచ్చగాడు 2 పై ప్రమోషన్లు లేకుండానే అంచనాలు పెరిగిపోయాయి.
బిచ్చగాడు సినిమాకు శశి దర్శకత్వం వహించగా.. బిచ్చగాడు 2 సినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. హీరోగానే కాకుండా మిగతా విభాగాల్లోనూ ఆయన అద్భుత పనితీరును కనబరిచాడు. మరోవైపు ఈ సినిమా తెలుగులో కంటే.. తమిళంలో వసూళ్లు ఎక్కువ రాబడుతోంది. చాలా గ్యాప్ తర్వాత బిచ్చగాడు 2 తో విజయ్ ఆంటోని పెద్ద హిట్ కొట్టాడు. దేవ్ గిల్, జాన్ విజయ్, యోగి బాబు తదితరులు నటించిన ఈ సినిమా నెలరోజుల తర్వాత ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story