రాహుల్ ఒంటరి పోరాటం?
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఓ పొలిటీషియన్ కొడుకు పబ్ లో దాడి చేసిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ [more]
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఓ పొలిటీషియన్ కొడుకు పబ్ లో దాడి చేసిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ [more]
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఓ పొలిటీషియన్ కొడుకు పబ్ లో దాడి చేసిన దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ తప్పెవరిది అనే కన్నా.. ఎవరు ఎవరిని కొట్టారు అనేది ఆ వీడియో లో కనబడుతుంది. రాహుల్ తో వచ్చిన అమ్మాయిని ఏడిపించారని రాహుల్ ఆ యువకుల మీదకి వెళితే వారు రాహుల్ తల మీద బీర్ బాటిల్ తో దాడి చేసారు. చిన్న గాయాలతో బయటపడ్డ రాహుల్ ఆ పొలిటిషన్ కొడుకు మీద గచ్సిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ పెట్టడమే కాదు.. మీడియా తో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ లను న్యాయం చెయ్యమని అడిగాడు. అయితే తాజాగా రాహుల్ పబ్ లోని సిసి టివి ఫుటేజ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆ లింక్ కేటీఆర్ ట్విట్టర్ కి పంపాడు. కేటీఆర్ గారు మీకు ఓటేశా.. నాకు న్యాయం చెయ్యండి అంటూ వేడుకున్నాడు.
ఇంతజరుగుతున్నా రాహుల్ సిప్లిగంజ్ మీద సానుభూతి చూపించేవారు ఒక్కరు కూడా కనిపించడం లేదు. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక హౌసెమెట్స్ తో పార్టీలు చేసుకున్న రాహుల్… ఇప్పుడు కష్టాల్లో ఉంటే.. ఏ ఒక్క బిగ్ బాస్ మిత్రులు పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఆఖరుకి రాహుల్ క్లోజె ఫ్రెండ్ పునర్నవి కూడా మీడియా ముఖంగా రాహుల్ సిప్లిగంజ్ పై దాడిని ఖండించలేదు అంటే…. రాహుల్ కి ఎవరూ హెల్ప్ చెయ్యరని అర్ధమైంది. రాహుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నోయల్ లాంటివాళ్లు కూడా రాహుల్ వెనక నిలబడలేదు. ఆ పబ్ లో ఎవరిదీ తప్పు, ఎవరిదీ ఒప్పు అని ఆలోచిస్తున్నారో.. లేదంటే ఎమ్యెల్యే కొడుకు అంటున్నారు.. ప్రభుత్వంతో పెట్టుకుంటే మనకెందుకులే అని సైలెంట్ అయ్యారో కానీ.. రాహుల్ మాత్రం పబ్ ఘటనపై ఒంటరిగా పోరాడుతున్నాడు.