టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్
బిగ్ బాస్ 4 లో చివరి అంకానికి చేరుకుంది. నాగార్జునకి సీజన్ 4 చాలా తృప్తినిచ్చింది అంటూ ప్రెస్ నోట్ కూడా రిలీస్ చేసింది స్టార్ మా. [more]
బిగ్ బాస్ 4 లో చివరి అంకానికి చేరుకుంది. నాగార్జునకి సీజన్ 4 చాలా తృప్తినిచ్చింది అంటూ ప్రెస్ నోట్ కూడా రిలీస్ చేసింది స్టార్ మా. [more]
బిగ్ బాస్ 4 లో చివరి అంకానికి చేరుకుంది. నాగార్జునకి సీజన్ 4 చాలా తృప్తినిచ్చింది అంటూ ప్రెస్ నోట్ కూడా రిలీస్ చేసింది స్టార్ మా. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ కి టాస్క్ ల వలన కానీ, కంటెస్టెంట్స్ వలన కానీ క్రేజ్ రాలేదు. కేవలం నాగార్జున శని, ఆదివారాలు ఎపిసోడ్స్ వల్లనే బిగ్ బాస్ సీజన్ 4 కి కాస్తో కూస్తో రేటింగ్ తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం చివరి రెండు వారాలకు గాను కేవలం ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో మిగిలారు. అందులో ఈవారం ఒకరు ఎలిమినేట్ అయితే ఐదుగురు టైటిల్ రేసులో ఉంటారు. ఇప్పటికే అఖిల్ టాప్ 5 కి వెళ్ళిపోయి సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మిగిలిన హారిక, మోనాల్, అరియనా, అభిజిత్, సోహైల్ లో ఈ వారం మోనాల్ హౌస్ నుండి బయటికి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అయితే ఎప్పటినుండో సోషల్ మీడియా టాక్ ప్రకారం సీజన్ 4 టాప్ 2 రేసులో అభిజిత్ కానీ, అఖిల్ కానీ ఉంటారని ప్రచారం జరుగుతుంటే.. ఇప్పుడు అనూహ్యంగా మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ ఫెవరెట్ గా కనిపిస్తున్నాడు. అతనే సోహైల్. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ యాజమాన్యం కూడా సోహైల్ ని హైలెట్ చేస్తుంది. స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తున్నారు. ప్రేక్షకులంతా సోహైల్ ని చూసేలా ప్లాన్ చేస్తున్నారు. మొదటి నుండి అభిజిత్ టైటిల్ విన్నర్ అని.. లేదు అంటే అఖిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సోహైల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సోహైల్ కి కోపం వచ్చినా చప్పున చల్లారిపోవడం. అలాగే బిగ్ ఎంటర్టైనర్. అందరితో ఫ్రెండ్ షిప్. అరియానాతో టామ్ అండ్ జెర్రీ ఆట అన్ని సోహైల్ ని టైటిల్ కి దగ్గర చేస్తున్నాయని అంటున్నారు