ఏడుపులు హౌస్.. బిగ్ బాస్ హౌస్!!
బిగ్ బాస్ సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో.. సోషల్ మీడియాలో ముందే లీక్ చేసినట్టుగా.. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి [more]
బిగ్ బాస్ సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో.. సోషల్ మీడియాలో ముందే లీక్ చేసినట్టుగా.. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి [more]
బిగ్ బాస్ సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో.. సోషల్ మీడియాలో ముందే లీక్ చేసినట్టుగా.. ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే. అసలు మెహబూబ్, నాగ్ తో స్టేజ్ మీదకి రాకముందు నుండే బిగ్ బాస్ హౌస్ ఏడుపులతో నిండిపోయింది. సోహైల్ కి – మెహబూబ్ కి మధ్యన ఎవరు సేవ్ అవుతారో అనే టాస్క్ లో మెహబూబ్ ఎలిమినేట్ అవ్వగా.. అక్కడనుండి సోహైల్ ఏడుపు స్టార్ట్ చేసాడు. మెగబూబ్ ఎలిమినేట్ అవడం జీర్ణించుకోలేని సోహైల్ బిగ్గరగా ఏడుస్తూ హే అల్లా అంటుంటే.. అభిజిత్, అవినాష్, మోనాల్, అఖిల్, హారిక, లాస్య అందరూ ఏడుస్తూ మెహబూబ్ ని బయటికి పంపేశారు.
సోహైల్ బిగ్ బాస్ గేమ్ అన్ ఫెయిర్.. బయట సీజన్ 1 అండ్ 2 లలో ఎలిమినేట్ అయిన వారిని చూస్తే ఏం అనిపించేలేదు.. కానీ ఇప్పుడు ఇక్కడ హౌస్ నుండి మెహబూబ్ వెళుతుంటే తట్టుకాకపోతున్న అంటూ ఏడ్చేశాడు. బిగ్ బాస్ ఇది మైండ్ తోనూ మనసుతోను ఆటాడాలి అంటూ సోహైల్ అయితే బిగ్గరగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మెహబూబ్ అయితే చెప్పే పనే లేదు.. నువ్ ఎలిమినేట్ అనగానే మొదలెట్టిన ఏడుపు నాగార్జున తో స్టేజ్ మీదున్నంత సేపు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఒక్కో హౌస్ మేట్స్ తో మట్లాడుతూ మెహబూబ్ ఎమోషనల్ గా ఏడుస్తూ హౌస్ మేట్స్ ని ఏడిపించేసాడు. సండే ఫన్ డే అనేకన్నా… సండే క్రయింగ్ డే అనొచ్చేమో అనిపించేలా హౌస్ మేట్స్ ఏడుపు, మెహబూబ్ ఏడుపు ఉంది. బిగ్ బాస్ ప్రేక్షకులకు చిరాకు పుట్టేలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ కనిపించింది.
- Tags
- big boss 4