ఎవరికెంత దమ్ముంది
ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సాహో – సై రా నరసింహారెడ్డి చిత్రాలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ సాహో [more]
ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సాహో – సై రా నరసింహారెడ్డి చిత్రాలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ సాహో [more]
ఈ ఏడాది విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో సాహో – సై రా నరసింహారెడ్డి చిత్రాలు అన్ని విషయాల్లో పోటీ పడుతున్నాయి. ప్రభాస్ క్రేజ్ సాహో కి, చిరు క్రేజ్ సై రా నరసింహారెడ్డి కి బాగా హెల్ప్ అవుతున్నాయి. బాహుబలితో భారీ క్రేజ్ తో ప్రభాస్ సాహో మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక చిరు సై రా లో అమితాబ్, కన్నడ స్టార్ సుదీప్, తమిళం నుండి విజయ్ సేతుపతిలు నటించడంతో సై రా క్రేజ్ కూడా ఇండియా వైడ్ గా అదరగొట్టేస్తుంది. ఒక చోట సై రా క్రేజ్ భారీగా ఉంటే… మరోచోట సాహో క్రేజ్ కూడా అదే లెవల్లో ఉంది. ఇక సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్, మెగాస్టార్ చిరు ఫాన్స్ కూడా తమ తమ హీరోలను తెగ ప్రమోట్ చేస్తూ హైప్ చేస్తున్నారు.
చిరు సై రా లో పలు భాష నటులు నటించడంతో…. ఆయా భాషల్లో సై రా సినిమాకి భారీ క్రేజ్ వచ్చేసింది. అందుకే కన్నడనాట సై రా హక్కులకు భారీ డిమాండ్ వచ్చి 30 కోట్లు వచ్చాయనే ప్రచారం ఉంది. మరి కన్నడ నటుడు సుదీప్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చెయ్యడం వలనే సై రా కి ఆ రేంజ్ క్రేజ్ వచ్చిందనేది సత్యం. మరి బాహుబలి తో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ సాహో సినిమా కన్నా సై రా కే కన్నడ నాట ఎక్కువ బిజినెస్ జరగడం సినీ వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. ఇక మిగతా ఏరియాల కొచ్చేసరికి సై రా ని తన్నేసింది సాహో. ఒక పక్క క్రేజ్ విషయంలోనూ మరోపక్క బిజినెస్ విషయంలో ఒక సినిమాతో ఒకటి భారీగా పోటీ పడుతున్నాయి. రెండు సినిమాలుకు విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. మరి ఎవరి సినిమాలో ఎంత దమ్ముందో అనేది ఒకటి ఆగష్టు 15 కి తెలిస్తే(సాహో రిలీజ్ డేట్) మరొకటి అక్టోబర్ 2 న (సై రా రిలీజ్ డేట్) తెలుస్తాయి